రూటు మార్చిన సల్మాన్ ఖాన్?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టాలీవుడ్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో నటనతో తన సత్తాను నిరూపించుకొని ఎంతో మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న సల్మాన్ ఖాన్, ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డబ్బింగ్ సినిమాతో కాకుండా ఏకంగా డైరెక్టుగా తెలుగు సినిమాలో నటించబోతున్నాడు.ఈ క్రమంలోనే తెలుగులో తన ఫేవరేట్ తెలుగు స్టార్ తో కలిసి నటించబోతున్నాను అనీ ప్రకటించారు సల్మాన్ ఖాన్.

ఇకపోతే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అంతిమ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఎమోషన్స్ లో భాగంగానే ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు చిత్రాల గురించి చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్. చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో నటించబోతున్నట్లు తెలిపారు. అలాగే హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి మరొక సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు. అయితే ఆ ప్రాజెక్టు ఏంటి అనేది క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Share.