బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి, అతనికి ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ హీరో అయిన ప్పటికీ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు.దేశవ్యాప్తంగా సల్మాన్ ఖాన్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కండల వీరుడు హైదరాబాదులో కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు.
ఈ బాలీవుడ్ హీరో కూకట్ పల్లిలోని సుజనా ఫోరం మాల్ లో సందడి చేయనున్నారు.తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాదుకు వచ్చారు. అయితే ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి ఎంటర్ అయినా సల్మాన్ ఖాన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ ని చూసిన అభిమానులు ఒక్క సెల్ఫీ అంటూ సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు.సల్మాన్ ఖాన్ ని చూసిన ఆనందంలో కేకలు వేస్తు తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సల్మాన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హైదరాబాదులో మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ @సల్మాన్ ఖాన్ అంటూ మురిసిపోతున్నారు.