బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్మించిన తాజా చిత్రం అంతిమ్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ హీరోలుగా నటించారు.మహేష్ వి మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 26 న విడుదలైంది. ఈ సందర్భంగాతాజాగా హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి థాంక్స్ మీట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవి గారు రామ్ చరణ్ నాకు మంచి స్నేహితులు. అలాగే వెంకటేష్ గారు కూడా బాగా తెలుసు.
నేను నేరుగా తెలుగులో నటిస్తున్నాను. చిరంజీవి గారు నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నన్ను చేయమని చిరంజీవి గారు అడిగారు. అప్పుడు నేను పాత్ర ఏంటి?ఎన్నిరోజులు షూటింగ్ అని అడగకుండా సరే అన్నాను. గాడ్ ఫాదర్ సినిమా తర్వాత వెంకటేష్ గారితో కూడా నటించబోతున్నారు అని సల్మాన్ ఖాన్ తెలిపారు.ఇక అంతిమ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రత్యేకించి హైదరాబాదులో బాగా ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు వచ్చాను అని తెలిపారు .