‘సలార్’ నుంచి న్యూ అప్‌డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ఫిల్మ్ ‘సలార్’. ఈ చిత్ర షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌లో తెలంగాణలోని రామగుండంలో కంప్లీట్ అయిన సంగతి అందరికీ విదితమే. ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి‌హాసన్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా నుంచి స్పెషల్ అప్‌డేట్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం 10.30 గంటలకు సలార్ నుంచి ‘రాజమన్నార్’ రివీల్ కాబోతున్నాడు అంటూ హోంబేలె పిక్చర్స్ వారు పోస్టర్ విడుదల చేశారు.

ఈ సినిమాలో ఐటం సాంగ్ ఉంటుందని సమాచారం. కాగా, అందుకుగాను ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను సంప్రదించినట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కోసం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ షూటింగ్ పూర్తి కాగా త్వరలో‘సలార్’ షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ అవుతారట. ఈ సినిమా షూటింగ్ చేసుకుంటూనే ప్రభాస్ ప్యారలల్‌గా ‘ప్రాజెక్ట్ కె, ఆది పురుష్’ చిత్రాల్లో నటిస్తారట.

Share.