సాక్ష్యం రివ్యూ అండ్ రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లుడు శ్రీను సినిమాతో బెల్లం కొండ సురేష్ కొడుకు గా ఇండస్ట్రీ లోకి వచ్చిన బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ఆ తరవాత కాలం లో మంచి హీరోగా ఎదగడం కోసం చాలానే ట్రై చేస్తున్నాడు. అడపా దడపా ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతుంటే కొన్ని సార్లు బెడిసి కొడుతూ ఉన్నాయి. అయితే ఓవర్ ఆల్ గా ఇంకా మినిమం హీరోగా కూడా నిలదొక్కుకోలేదు మనోడు. టాప్ డైరెక్టర్ లు , టాప్ హీరోయిన్ లకి పెట్టింది పేరు బెల్లం కొండ శ్రీనివాస్. పెర్ఫార్మెన్స్ కంటే కూడా రిచ్ నెస్ విషయం లో స్పెషల్ కేర్ తీసుకుంటాడు ఈ హీరో. శ్రీవాస్ డైరెక్షన్ లో సాక్ష్యం అంటూ తన కొత్త ప్రయత్నాన్ని ఈ అల్లుడు శ్రీను ఏ మేరకు సఫలీ కృతం చేసాడో చూద్దాం రండి.

ప్లస్ పాయింట్స్

రాజా ఎన్నో పూజలు చేసిన తరవాత పుడతాడు విశ్వ – బెల్లం కొండ .. అయితే రాజా (శరత్ కుమార్) కీ ముని స్వామి (జగపతి బాబు) కీ పడదు. మునిస్వామి తమ్ముళ్ళు చేసే దుర్మార్గాలకి అడ్డుగా వస్తున్నాడు అని విశ్వ ని పసిబిడ్డగా ఉన్నప్పుడే రాజా కుటుంబం ని చంపేస్తారు వాళ్ళు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్యన విశ్వ మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడబడి ఒక ఉన్నత బిజినెస్ ఫ్యామిలీ లో పడతాడు. శివ ప్రసాద్ – పవిత్ర లోకేష్ ల కొడుకుగా అమెరికా లో ఉంటాడు అతను., సౌందర్య లహరి అనే అమ్మాయి (పూజా హెగ్డే) అతనికి తారస పడుతుంది. ఆమె ప్రేమలో పడతాడు అతగాడు. ఆమె కోసం అనుకోకుండా ఇండియా వచ్చే విశ్వ కి తన గతం గురించి తెలుస్తుంది. పంచభూతాలు ఆడే నాటకీయ పరిణామాల మధ్య చంపేవాడు (విశ్వాజ్ఞ), చచ్చేవాళ్ళు (మునిస్వామి, అతని తమ్ముళ్లు) ఒకరికి ఒకరు తెలియకుండా, విశ్వాజ్ఞ వాళ్ళని ఎలా చంపాడు ? వాళ్ళు ఎలా చచ్చారు ? చివరకి హీరో హీరోయిన్లు కలుస్తారా ? అసలు విశ్వాజ్ఞకు చనిపోయిన అతని కుంటుంబం గురించి తెలుస్తోందా ? ప్రకృతి కీ విశ్వ కీ ఏం సంబంధం ఇలాంటి విషయాలు ఈ సినిమా చూస్తే కానీ తెలీవు ! ఈ సినిమాకి అతిపెద్ద హై లైట్ బెల్లం కొండ శ్రీనివాస్ లుక్స్ అనే చెప్పాలి. అతని ఫిజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. సిక్స్ ప్యాక్ తో పాటు పరిణితి చెందిన నటన తో మరొక మెట్టు ఎక్కేసాడు మనోడు. ఇంట్రడక్షన్ సీన్ లో చేసిన షాట్ చాలా రిస్కీ అని చెప్పాలి, సినిమా కోసం ఈ రోజుల్లో అంత సాహసం చేసే హీరోలు కనపడరు. శ్రీనివాస్ కి అది పెద్ద ప్లస్ పాయింట్, ఇక హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది. డైరెక్టర్ శ్రీవాస్ కూడా ఈ సినిమాలో ఒక కొత్త యాంగిల్ ని చూపించాలి అని ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ గా నిలిచాడు. జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి లాంటి మంచి నటులు ఈ చిత్రంలో విలన్ల పాత్రలను పోషించి ఈ చిత్రాన్ని మరో స్థాయికు తీసుకెళ్లారు.

మైనస్ పాయింట్స్

కొత్త పాయింట్ మీద నడిచే ఈ సినిమా కి సీన్ లు మాత్రం పక్కా కమర్షియల్ గానే తీసేశారు. మరీ రొటీన్ మూసగా అనిపిస్తూ ఉంటాయి సీన్లు అన్నీ. సినిమా మొదట్లో చాలా ఆసక్తికరంగా తెరకి ఎక్కించి ఆ కొద్ది సేపటికి రొటీన్ మూస లోకి దించేశాడు . మునుస్వామి (జగపతిబాబు) అతని తమ్ముళ్లు చేసే హత్యలు అన్యాయాలు వాస్తవానికి చాలా దూరంగా ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాని సినిమాలానే చూస్తారు తప్ప, పాత్రల్లో మమేకం అయిపోయి ఫీల్ అయ్యే సందర్భాలు చాల తక్కువ. సాంగ్స్ వినడానికి కూడా పెద్దగా హిట్ అవ్వలేదు, రిచ్ గా ఉన్నా మ్యూజిక్ బాలేకపోవడం పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి. స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్ గా పెట్టడం ఓకే కానీ వేసిన ముడులు విప్పడం లో కాస్త స్లో గానే నడిచింది బండి మొత్తం.

సాక్ష్యం సినిమా ట్రైలర్ ల దగ్గర నుంచీ సినిమా మొత్తం కొత్త యాంగిల్ లో ఉండబోతోంది అనే ప్రచారం ఊపు ఊపేసినా కానీ అవుట్ పుట్ మాత్రం చాలా రొటీన్ గా ఉండడం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి. డైరెక్టర్ శ్రీవాస్ యుగానికి ఒక్కడు లాంటి ఏదో సినిమా తీస్తాడు అనుకున్నారు కానీ ఇలాంటి కమర్షియల్ హంగులతో సినిమా ముగించేసాడు అని జనం ఫీల్ అయ్యేలా ఉంది చిత్రం. ఓపెనింగ్ సీన్స్ బాగున్నప్పటికీ, సినిమా అనుకున్నంత కొత్తదనంగా లేకపోవడం, అక్కడక్కడ కొన్ని దృశ్యాలు ఆసక్తికరంగా లేకపోవడం.

రేటింగ్: 3/5

Share.