టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హేగ్దే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’ పోయిన శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చూడొచ్చని మొదటి షో నుండే టాక్ వచ్చింది. ఇక పూజ హేగ్దే తన అందాలతో ప్రేక్షకులని బాగానే కనువిందు చేసింది. ముఖ్యంగా పాటల్లో పూజ అందాల ప్రదర్శన యువతని అలరించింది. ఇక ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. సుమారు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో 7.25 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఇక ఏరియా వైస్ ‘సాక్ష్యం’ కలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం:
నైజాం 2.26 కోట్లు
సీడెడ్ 1.6 కోట్లు
గుంటూరు 81 లక్షలు
కృష్ణ 55 లక్షలు
తూర్పు గోదావరి 58 లక్షలు
పశ్చిమ గోదావరి 41 లక్షలు
నెల్లూరు 31 లక్షలు
ఉత్తరాంధ్ర 1.2 కోట్లు