చిరు కష్టాలను వివరించిన జాతీయ మీడియా

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘సైరా’, ఈ సినిమా కోసం చిరు పడుతున్న కష్టాల గురించి ఒక జాతీయ పత్రిక కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘సైరా’ చిరు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్కమైన చిత్రం.అందుకే మెగాస్టార్ ఈ సినిమా కోసం ఎంతో కష్ట పడుతున్నారని తెలిసింది. ఎక్కడ కంప్రమైజ్ కావట్లేదని ప్రతి సన్నివేశాన్ని చాల జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఒక బారి సెట్ వేసి చిత్రం లోని కొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారట, ఇందులో భాగంగా చిరంజీవి తెల్లవారుఝామున 3 గంటల వరకు పడుతున్న కష్టాన్ని ఒక ప్రముఖ పత్రిక ప్రత్యకంగా ప్రచురించింది.

కొన్ని నెలలుగా సుమారు 50 మంది ఫైటర్స్ ని ప్రత్యకంగా లండన్ నుండి తీసుకు వచ్చి దాదాపుగా 40 కోట్లు ఖర్చు పెట్టి ఒక బారి ఫైట్ ని చిత్రీకరిస్తున్నారట. సినిమాలో తొలి భాగం చివర్లో వచ్చే ఈ సన్నివేశం మూవీ కి ఎంతో కీలకం కావటంతో ఇంత బారి సొమ్ము ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ ఒక్క ఫైట్ సీన్ కోసమే చిరు అర్ధ రాత్రి మూడు గంటల వరకు బాగా కష్టపడుతున్నారని ఆ పత్రిక వెల్లడించింది.

‘సైరా’ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,నయనతార, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది.

Share.