టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘ శైలజ రెడ్డి అల్లుడు ‘, ఈ సినిమా ట్రైలర్ కొద్దీ నిమిషాల క్రితం విడుదల చేసారు చిత్ర బృందం. హీరో నాగ చైతన్య కూడా తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ థియేట్రికల్ ట్రైలర్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. అను ఇమ్మాన్యుయేల్ తొలి సారి నాగ చైతన్య కి జోడిగా నటిస్తుంది.
ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్స్ మరియు టీజర్స్ అక్కినేని అభిమానులనే కాకుండా సినీ ప్రేక్షకులకి కూడా ఎంత గానో నచ్చటంతో ఈ చిత్రం పై అంచనాలు బాగా పెరిగాయ్. ప్రముఖ దర్శకుడు మారుతీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించగా, ఎస్ రాధా కృష్ణ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమ్య కృష్ణ ఈ సినిమాలో అను కి అమ్మ గా కీలక పాత్ర పోషించటం విశేషం. సెప్టెంబర్ 13 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.