అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శైలజ రెడ్డి అల్లుడు’ టీజర్ ఈ రోజు విడుదల చేసింది చిత్ర బృందం. ప్రముఖ దర్శకుడు మారుతీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ అలనాటి అందాల నటి రమ్య కృష్ణ ఈ సినిమాలో అత్తా పాత్రలో కనిపించనున్నారు, ఇటీవలే రమ్య కృష్ణ హైదరాబాద్ లో తన షూటింగ్ పార్ట్ ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చైతు కెరీర్ లోనే బెస్ట్ గా నిలవనుంది, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ 25 కోట్లు బిజినెస్ చేసిందని సమాచారం.
ఈ రోజు విడుదల చేసిన టీజర్ ద్వారా ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిన లవ్ స్టోరీ అని తెలుస్తుంది. నాగ చైతన్య ఈ సినిమాలో చాల హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. చైతు, అను మరియు రమ్య కృష్ణ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులని అలరిస్తాయని చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది. ఈ సినిమా ఆగష్టు 31 వ తేదీన విడుదల కానుంది.