చైతు, మారుతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. నాగ చైతన్య, అను ఎమ్మాన్యుయెల్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా క్రేజీ రోల్ చేశారు. వినాయక చవితి సందర్భంగా రిలీజైన ఈ సినిమా టాక్ యావరేజ్ అని వచ్చిన కలక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. చైతు కెరియర్ లో హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్ట్ చేసిన మూవీగా శైలజా రెడ్డి అల్లుడు రికార్డ్ సృష్టించింది.
ఇక పోయిన గురువారం రిలీజైన శైలజా రెడ్డి అల్లుడు మొదటి వారంలో 16.14 కోట్ల షేర్ రాబట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా 24.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఇప్పటివరకు 16.14 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.
ఏరియాల వారిగా చైతు శైలజా రెడ్డి వారం కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాం : 3.90 కోట్లు
సీడెడ్ : 2.45 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.53 కోట్లు
గుంటూర్ : 1.23 కోట్లు
ఈస్ట్ : 1.38 కోట్లు
వెస్ట్ : 0.86 కోట్లు
కృష్ణా : 0.93 కోట్లు
నెల్లూరు : 0.56 కోట్లు
ఏపి/ టెలంగాణా : 12.84
రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.75 కోట్లు
ఓవర్సీస్ : 1.55 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ కలక్షన్స్ : 16.14 కోట్లు (షేర్)