SaiPallavi: బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్న సాయి పల్లవి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

SaiPallavi..తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఫిదా సినిమాతో పరిచయమయ్యిది హీరోయిన్ సాయి పల్లవి(SaiPallavi).. అలా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది సాయి పల్లవి. అంతే కాకుండా ఈమె నాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. తన కట్టు బొట్టు చూస్తుంటే తెలుగులో భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకొని ఏకంగా లేడీ పవర్ స్టార్ అని పిలిపించుకుంది.సాయి పల్లవి డాన్స్ చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే అయితే ఫిదా సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిల కనిపించి అందంతో అభినయంతో అభిమానులను ఆకట్టుకుంది.

Sai Pallavi: ముంబైలో మెరిసిన సాయిపల్లవి.. ఆ వీడియో చూసి ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

ఫిదా తరువాత కొన్ని సినిమాలను చేసింది. కానీ ఏ సినిమా తనకి ఇంత పెద్దగా పేరును తెచ్చిపెట్టలేదు. అలాగని సాయి పల్లవి కెరియర్ డల్ అవుతోందని ఏది పడితే ఆ సినిమాలు చేయలేదు. తనకి కథ పాత్ర నచ్చితేనే చేస్తుంది. అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ తనకు నచ్చితేనే ఒప్పుకుంటుంది. అందుకే తన కెరియర్లో ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. ఈ మధ్యకాలంలో గార్గి సినిమాతో నటించి మంచి సక్సెస్ను అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలయ్యి ఏడాది అయ్యి విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియన్స్ లు కూడా అలరించింది.

అయితే ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు బెస్ట్ యాక్టర్ గా అవార్డు పొందింది. లేటెస్ట్ గా ముంబైలో క్రిటిక్ ఛాయిస్ అవార్డు జరిగాయి. గార్గి సినిమాలో ఈ అమ్మడి నటనకు ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డును అందుకోవడానికి సాయి పల్లవి ముంబాయిలో ఇచ్చేసింది. అలా సాయి పల్లవి రెడ్ చీరలో ఎంతో అందంగా ముచ్చటగా కనిపించింది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు మాత్రం తాను సినిమాలలో నటించాలని కోరుకుంటూ ఉన్నారు.

Share.