తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని చెప్పిన సాయి పల్లవి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ గా పేరు సంపాదించింది. ఎందుకంటే ఈమె ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందని చెప్పవచ్చు.. ముఖ్యంగా తన గ్లామర్ షో చేయడానికి ఎక్కువ మక్కువ చూపదు.అంతేకాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ ఉంటుంది సాయి పల్లవి. అందుకే ఈ ముద్దుగుమ్మను నేచురల్ బ్యూటీగా కూడా పిలుస్తూ ఉంటారు అభిమానులు.సౌత్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్లకు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Pushpa 2: Allu Arjun onboards Sai Pallavi in the Pushpa's follow up  franchise

ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో సైనా నటించకుండా ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయి పల్లవి నటన గురించి సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు పాత్ర నచ్చితే ఎలాంటి సినిమాలలోనైనా అయినా సరే ఎలాంటి హీరోతోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది. తన పాత్ర నచ్చకుంటే ఎలాంటి హీరో కైనా సరే నో అని చెప్పేస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల సాయి పల్లవి పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించింది.

అమ్మాయిలకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల పైన సాయి పల్లవి స్పందిస్తూ తాను కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నానని తన చిన్నవయసులో గ్రౌండ్కు వెళ్లి ఆడుకుంటున్న సమయంలో తన వయసు 14 సంవత్సరాలని తెలియజేసింది. అలా గ్రౌండ్ లో సెటిల్ ఆడుకుంటున్న సమయంలో అక్కడ కోచ్గా పని చేస్తున్న ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి నేర్పిస్తాను అంటూ చెప్పారట. అలా నేర్పిస్తానని చెప్పి కావాలనే తన మీద చేతులు వేసి నొక్కుతూ ఉన్నారని తెలిపింది సాయి పల్లవి.

దీంతో తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించిందని వెంటనే ఏడువాలనిపించింది కానీ తను ఒక్కసారిగా వదిలిపెట్టండి అని అరిచేసరికి అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపింది సాయి పల్లవి. ఆ తర్వాత మరొకసారి ఆ గ్రౌండ్ కి వెళ్లలేదని ఎప్పుడు కూడా అలాంటి అనుభవం ఎదురు కాలేదని తెలియజేస్తోంది సాయి పల్లవి. ప్రస్తుతం ఇమే చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Share.