టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో హీరోయిన్ సాయి పల్లవి కూడా ఒకరు. అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలో నటించి మెప్పించింది.. తనకు తన పాత్ర నచ్చితే ఆ సినిమాను యాక్సెప్ట్ చేస్తుంది.. అంతేతప్ప తనకు పాత్ర నచ్చకపోతే స్టార్ హీరోల సినిమాలైనా సరే రిజెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ పద్ధతి సాయి పల్లవి మొదటి నుంచి అలవాటు చేసుకుంది. ఆ కారణంగానే ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో పెద్దగా అవకాశాలు రాలేదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. అలా అని ఆమెకు అవకాశాలు రాలేదా అంటే భారీగానే వస్తున్నాయి.. కానీ తానే రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలలో డియర్ కామ్రేడ్ సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ,రష్మిక జంటగా రెండవసారి నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా వాస్తవంగా ముందు సాయి పల్లవిని హీరోయిన్గా అడగగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వచ్చే కథకు సాయి పల్లవి కరెక్ట్ గా సరిపోతుందని ఆమెకు కథ వినిపించారట డైరెక్టర్ భరత్.. అయితే సాయి పల్లవికి తన పాత్ర బాగానే నచ్చిన విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ చేయాలని చెప్పడంతో వెంటనే ఆ సినిమాని రిజెక్ట్ చేసిందట. తనకు లిప్ లాకులు అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కాబట్టి తాను చేయనని డైరెక్టర్ కి డైరెక్ట్ గా చెప్పేసిందట.
ఇక అలా సాయి పల్లవి రిజెక్ట్ చేయడంతో రష్మికాని ఇందులోకి తీసుకోవడం జరిగిందట. ఈ సినిమా కమర్షియల్ గా హిట్టు కాకపోయినా యూత్ ను మాత్రం బాగానే ఆకట్టుకోవడం జరిగింది. సాయి పల్లవి ఈ విషయాలను స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఈ ముద్దుగుమ్మ అసలు నటించలేదని చెప్పవచ్చు. దాదాపుగా సాయి పల్లవి నుంచి సినిమాలు విడుదల కాగా ఏడాది పైనే కావస్తోంది.