నిధి అగర్వాల్ పై కనేసిన మెగా హీరో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని అన్నదమ్ములు ఇద్దరితో సినిమాలు చేసి తెలుగులో ఐరన్ లెగ్ అనిపించుకున్న భామ నిధి అగర్వాల్ ఇప్పుడు గోల్డెన్ లెగ్ అవబోతుంది. రాం హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆమెకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో నిధి అగర్వాల్ కు అదిరిపోయే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నిధి అగర్వాల్ కు రెండు క్రేజీ ఆఫర్లు వచ్చినట్టు టాక్.

ఇక ఇప్పుడు మరో మూవీ ఆఫర్ కూడా తలుపు తట్టిందట. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. చిత్రలహరితో హిట్ అందుకున్న సాయి ధరం తేజ్ ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో ప్రతిరోజు పండుగే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో సాయి ధరం తేజ్ సినిమా ఉంటుందట. సుబ్బు అనే న్యూ టాలెంటెడ్ డైరక్టర్ ఈ సినిమాను చేస్తున్నారట.

ఈ మూవీలో సాయి ధరం తేజ్ కు జోడీగా నిధి అగర్వాల్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మెగా హీరోల్లో ఒకరితో సినిమా చేసి హిట్ కొడితే మిగతా వారితో కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ లెక్క చూస్తే నిధి కూడా క్రేజీ హీరోయిన్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.

Share.