గల్లీ బోయ్ గా మెగా హీరో.. ఏది వదిలిపెట్టట్లేదుగా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక భాషలో హిట్టైతే అది వేరే భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణమే మన తెలుగు సినిమాలు చాలా తమిళ, హింది భాషల్లో రీమేక్ అయ్యాయి. ఇక్కడ హిట్టైన సినిమాలు అక్కడ అదే ఫలితాలను అందించాయి. ఇక కొన్నిసార్లు అక్కడ సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తున్నారుకోండి. బాలీవుడ్ లేటెస్ట్ మూవీ గల్లీ బోయ్ సినిమా ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ కొట్టింది. రణ్ వీర్ సింగ్, అలియా భట్ కలిసి నటించిన ఈ సినిమాను జోయా అక్తర్ డైరెక్ట్ చేశారు.

50 కోట్ల వసూళ్లను సాధించిన ఈ సినిమా 100 కోట్లవైపు దూసుకెళ్తుంది. పోటీగా సినిమాలేవి లేకపోవడం కలిసి వచ్చిన అంశం. ఇక ఈ సినిమా తెలుగు రైట్స్ అల్లు అరవింద్ కొనేశారట. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో ఈ సినిమా తెలుగులో రీమేక్ చేస్తారని అంటున్నారు. గల్లీ బోయ్ గా తేజూ అదరగొట్టడం ఖాయమని మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. రణ్ వీర్, అలియా నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్ లో ఫైనల్ గా ఎవరెవరు నటిస్తారో చూడాలి.

అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా దర్శకుడిగా కూడా ఎవరిని సెలెక్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్ అతని చేతుల్లోనే ఈ రీమేక్ పెడతాడా లేక మరో దర్శకుడితో చేస్తాడా అన్నది చూడాలి.

Share.