మెగా అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ అతి తక్కువ సమయంలోనే సుప్రీం హీరోగా మారి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ హీరో తొలుత వరుసబెట్టి సక్సెస్ చిత్రాలతో బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడుకున్న తేజు ఆ తరువాత తన జోరును కొనసాగించలేకపోయాడు. దీంతో అతడు వరుస ఫెయిల్యూర్స్‌తో వెనకబడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 6 చిత్రాలను ఫ్లాపులుగా మార్చి డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు తేజు.
ఇలా వరుసగా ఫెయిల్యూర్స్ వస్తుండటంతో తేజు ఈసారి కాస్త బ్రేక్ తీసుకునేందుకు రెడీ అయ్యాడు. దీనికోసం అమెరికా వెళ్లి అక్కడ మేకోవర్ కానున్నాడు తేజు. అయితే ఈ మేకోవర్ వెనుక కూడా తేజు మంచి ప్లాన్ వేశాడు. తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్లో చేయనున్నాడు తేజు. ఈ సినిమాకు ‘చిత్రలహరి’ అనే టైటిల్‌ను గతంలోనే ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో తేజు ఒక సరికొత్త లుక్‌తో మనకు దర్శనమిస్తాడు. ఇప్పుడు తన లుక్ ఛేంజ్ చేసుకునేందుకే ఈ అమెరికా ట్రిప్ వేస్తున్నాడు తేజు అనేది నిజం.
అయితే ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తేజు చిత్రలహరి చిత్రం కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌తో తేజు కుదుర్చుకున్న రెండు సినిమాల ఒప్పందం ప్రకారం ఈ సినిమాకుగాను తేజు రెమ్యునరేషన్ ఏమీ లేదట. అయితే తన నెక్ట్స్ మూవీకి మాత్రం తేజు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. ఇలా హిట్ కోసం తేజు సినిమాను ఫ్రీగా చేస్తుండటంతో ఇప్పుడు ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. బార్ అండ్ రెస్టారెంట్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రితికా సింగ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.