టాలీవుడ్ యంగ్ హీరోలలో సాయి ధరంతేజ్ కూడా ఒకరు.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న తన టాలెంట్ తో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. మొదట పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తన కెరియర్ను మొదలుపెట్టి..ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విరుపాక్ష సినిమా ఈనెల 21న విడుదల కాబోతోంది.
ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ లో పెద్ద ఎత్తున చిత్ర బృందం పాల్గొన్నా తేజ్.. తన జీవితంలో ప్రేమ పెళ్లి బ్రేకప్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. గత కొద్దిరోజులుగా పెళ్లి పైన అనేక వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పెళ్లి గురించి తేజ్ మాట్లాడుతూ.. ఎవరు అంటున్నారు కదా అని పెళ్లి ఇప్పుడే చేసుకోను నాకు చిన్నప్పుడే నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పాను తన జీవితంలోను బ్రేకప్ జరిగిందని ఓ అమ్మాయిని ప్రేమించిన తర్వాత విడిపోయామని తెలుపుతున్నారు తేజ్..
అందుకే ఆ తర్వాత అమ్మాయిలు అంటే తనకు భయం వేస్తుందని బ్రేకప్ తర్వాత సైలెంట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. గతంలో కూడా హీరోయిన్ రెజీనాతో, రాశి ఖన్నా తొ సాయి ధరమ్ తేజ్ లవ్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి.. ఇక రెజీనాతో పెళ్లి వరకు వెళ్లి మధ్యలో ఆగిపోయింది అనే వార్తలు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించాయి. దీంతో అభిమానుల సైతం ఇదేనేమో లవ్ బ్రేకప్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.. సాయి ధరంతేజ్ నటించిన విరూపాక్ష సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరంతేజ్ నటించిన చిత్రం కావడంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.