సాయి ధరమ్ తేజ్ సేవా గుణంతో తన ఔదార్యంను చాటుకున్నాడు. మేనమామ మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన మంచి లక్షణాలతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు సాయి ధరమ్ తేజ్. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.
సాయి ధరమ్ తేజ్ గత రెండుళ్లుగా ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ అనాథ శరణాలయంకు స్పాన్సర్‌గా ఉన్నాడు. 100 మంది చిన్నారులను దత్తత తీసుకుని వారికి చదువు చెప్పిస్తూ, వారికి పౌష్టికాహారం అందిస్తున్నాడు.
థింక్ పీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మున్నిగూడలో అక్షరాలయ పాఠశాల ను నెలకొల్పారు. ఇందులో సుమారు 100 మంది అనాథ పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు లేని అనాథలకు పౌష్టికాహారం అందక, చదువు సంధ్యలు లేక రోడ్డు మీది బతుకులు కావడంతో ఛలించిన అక్షరాలయ సంస్థ ఓ పాఠశాలన నెలకొల్పింది. ఈ అక్షరాలయంలో అనాథ పిల్లలకు చదువు చెప్పుతూ, పౌష్టికాహరం అందిస్తున్నారు. వీరిని సాయి ధరమ్ తేజ్ దత్తత తీసుకుని తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు. తానే కాదు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. సో సాయి ధరమ్ తేజ్ దాతృత్వానికి సెల్యూట్ చేయాల్సిందే..