యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్లలోకి వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోతుంది. బాహుబలి, శ్రీమంతుడు తాజాగా సాహో, సైరా సినిమాలతో సౌత్ మార్కెట్ తో పాటు బాలీవుడ్ మార్కెట్ స్థాయికి తెలుగు సినిమాలు స్థాయికి ఎదిగి పోతున్నాయి. బాహుబలి దెబ్బతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టి టాలీవుడ్‌పై పడింది. ఇప్పుడు ఏకంగా మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఇండియన్ సినిమా లవర్స్ అందరూ సాహో రిజల్ట్ కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాహోకు భారీ క్రేజ్ ఉంది. బాలీవుడ్లో సైతం సాహో సినిమా ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే టాలీవుడ్ సినిమాలు… బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలను బీట్ చేసి మరీ వసూళ్లు సాధిస్తుండడం తో ఇప్పుడు బాలీవుడ్ క్రిటిక్స్ టాలీవుడ్ సినిమాల పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అంతెందుకు కొద్దిరోజుల క్రితం తెలుగులో హిట్ అయిన అర్జున్‌రెడ్డి సినిమా హిందీలో కబీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్స్ లెక్కకు మిక్కిలిగా విమర్శలు చేశారు. అయితే సినిమా వసూళ్లు మాత్రం ఆపలేకపోయారు.
దీంతో ఇప్పుడు వాళ్ళ అక్కసంతా సాహోపై ఉంది. సినిమాకు యావరేజ్, ఎబో యావరేజ్ టాక్ వచ్చినా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచే సాహో సినిమా షోలు ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణలో మాత్రం రెగ్యులర్ టైమింగ్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం ఐదు గంటలకు సాహో సినిమా ఫలితం ఎలా ఉంటుందో ? దేశం మొత్తం తెలిసిపోతుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం మళ్లీ బాలీవుడ్ షాక్ అయ్యేలా వసూళ్లు ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే క్రేజ్ చూసి అటు బాలీవుడ్ హీరోలతో పాటు క్రిటిక్స్ సైతం కాస్త అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.