బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రీసెంట్ మూవీ సాక్ష్యం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. ‘ప్రకృతియే సాక్ష్యం’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీవాస్ డైరెక్ట్ చేయడం, ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్లు జనాలను ఆకట్టుకోవడంతో ఇదేదో అదిరిపోయే సినిమాలా ఉందని ఫిక్స్ అయ్యారు జనాలు. అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండటంతో ఇక ఈ సినిమా ఖచ్చితంగా హిట్టే అని నమ్మేశారు.
కట్ చేస్తే.. సినిమా రిలీజ్ రోజున డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది. సినిమాలో ఆకట్టుకునే అంశం ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకు జనాలు దూరంగా ఉన్నారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా వచ్చాయి. ఇక ఫ్లాపుగా ఈ సినిమా నిలుస్తుందని అనుకుంటే డిజాస్టర్‌గా మారి బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా పెట్టుబడిలో కేవలం 50 శాతం మాత్రమే వసూలు చేసి బెల్లంకొండ హీరో కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ. 11.87 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
ఇక ఏరియాలవారీగా ఈ చిత్ర వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – క్లోజింగ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 3.2 కోట్లు
సీడెడ్ – 2.05 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.45 కోట్లు
గుంటూరు – 0.96 కోట్లు
కృష్ణా – 0.68 కోట్లు
ఈస్ట్ – 0.85 కోట్లు
వెస్ట్ – 0.57 కోట్లు
నెల్లూరు – 0.5 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 10.26 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.35 కోట్లు
ఓవర్సీస్ – 0.26 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 11.87 కోట్లు