ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావడం చూసాము. ఒకే రోజు కొత్త సినిమాలకు మూహూర్తం పెట్టుకోవడం చూసాము. ఇద్దరు అగ్రహీరోలు నటించిన సినిమాల టీజర్లు ఒకే రోజు విడుదల కావడం అనేది ఎప్పుడు చూడలేదు. కాని ఈనెల 13న చూడబోతున్నాం. ఇద్దరు అగ్రహీరోలు నటించిన రెండు సినిమాల టీజర్లు ఒకే రోజు విడుదల చేసేందుకు చిత్ర బృందాలు మూహూర్తం ఫిక్స్ చేసుకోవడం విశేషం. అది పోటాపోటీగా నిర్వహించనున్నారు.
ఒకే రోజు ఇద్దరు అగ్రహీరోలు నటించిన సినిమాల టీజర్లు విడుదల చేసేందుకు ఓ వైపు సన్నహాలు జరుగుతున్నాయి. కాని ఈ టీజరు పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారోననే ఉత్కంఠతో అగ్రహీరోల అభిమానులు అతృతతో ఎదురుచూస్తున్నారు. ఇంతకు ఎవరా అగ్రహీరోలు అనుకుంటున్నారా. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్లే.
అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు 2, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాల టీజర్లు ఈనెల13న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రభాస్ నటించిన సాహో సినిమా హాలీవుడ్ తరహాలో తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మాణం గత రెండున్నరేళ్ళుగా సాగుతూ…నే ఉంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని అందుకే భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను విడుదల చేసేందుకు ముందుగానే మూహూర్తం ఫిక్స్ చేశారు. కానీ మన్మథుడు 2 సినిమా టీజర్ విడుదల 13నే విడుదల చేయాలని నాగార్జున పెండ్లి రోజైన 11న నిర్ణయించుకున్నారు. ఇద్దరు అగ్రహీరోల సినిమాల టీజర్లు ఒకేరోజు విడుదల కావడంతో టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది.