సాహో సినిమాలోని పాటను చిత్ర యూనిట్ ఇప్పుడే విడుదల చేసింది. సైకో సయాన్ పాటను విడుదల చేయడంతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు పండుగే పండుగ. యూవీ క్రియోషన్ నిర్మిస్తున్న సాహో సినిమాను సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని పాటను (హింది, తెలుగు వెర్షన్) విడుదల చేశారు. ఈ పాటలో హీరోయిన్ శ్రద్దాకపూర్తో ప్రభాస్ ఆడిపాడుతున్న పాట భలే రంజుగా ఉందని అంటున్నారు.
సాహో సినిమాను ఆగస్టు ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకుని విడుదల చేయనున్నారు. ఇక టీ సిరిస్ ఈ సినిమా పాటల హక్కులను పొందింది. ఇక ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించింది తనీష్ బాగ్చీ, పాటను కూడా తనీష్ బాగ్చీ (హింది ) సాహిత్యం అందించడం విశేషం. ఇక ఈ పాటలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంతో హాండ్సమ్గా ఉన్నాడు.
ప్రభాస్ సాహో పాటను విడుదల చేయడంతో సాహ్ సినిమాపై అంచనాలు పెంచాయి. సాహో సినిమాలోని సైకో సయాన్ పాటను అటు తెలుగులోనూ, ఇటు హిందిలోనూ విడుదల చేశారు. తెలుగులోనూ సంగీత దర్శకుడు తనీష్ బాగ్చీ స్వరాలు సమకూర్చగా, తెలుగులో మాత్రం సాహిత్యంను శ్రీజో అందించాడు.