సాహో అంటోన్న టాలీవుడ్‌…టాప్ లేపుతోన్న కామెంట్లు

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ మూవీ సాహో టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టీజర్‌ సంచలనాలు నమోదు చేస్తుంది. టీజ‌ర్ గురువారం ఉద‌యం 11.23 గంట‌ల‌కు రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన 25 నిమిషాల్లోనే సాహో టీజ‌ర్ ల‌క్ష లైక్స్ సాధించిన తెలుగు టీజ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. టీజ‌ర్‌లోని విజువ‌ల్స్ గ్రాండీయ‌ర్‌గా అభిమానుల‌ను అల‌రిస్తున్నాయి.

యావత్ ఇండియ‌న్ సినిమా అభిమానుల‌కు సాహో టీజ‌ర్ పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింది. ఇక టాలీవుడ్ సినిమా ప్రముఖులు కూడా సాహో టీజర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సాహో సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచే మ‌రో సినిమాగా నిలుస్తుంద‌ని చెపుతున్నారు. ఇక ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సాహో సినిమా యూనిట్ అయిన ప్రభాస్, సుజిత్‌, యూవీ క్రియేషన్స్‌ను ట్విటర్‌ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు.

ఇక టాలీవుడ్ కింగ్‌, సీనియర్ హీరోగా నాగార్జున ‘తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నందుకు ప్రభాస్‌, యూవీ క్రియేషన్స్‌కు సాహో’ అంటూ ట్వీట్ చేశారు.యంగ్ హీరోలు అఖిల్‌, నితిన్‌, అల్లు శిరీష్‌, రానా దగ్గుబాటి, రాహుల్‌ రవీంద్రన్‌లతో పాటు తమన్నా, గోపి మోహన్‌, హర్షవర్దన్‌ రానే, అడివి శేష్‌, సాయి ధరమ్‌ తేజ్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సుధీర్ వర్మ, సుశాంత్‌, పూరి జగన్నాథ్‌, చార్మీ, మారుతి, సురేందర్‌ రెడ్డి లతో పాటు చాలా మంది సాహో అంటూ ట్వీట్ చేస్తున్నారు.

ఇక సాహో టీజ‌ర్‌కు సోష‌ల్ మీడియాతో పాటు యూ ట్యూబ్‌లో కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిన సాహో సినిమా ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఆగ‌స్టు 15వ తేదీన రిలీజ్ అవుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల్లో సాహో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.

Share.