ప్రస్తుతం భారత్ దేశం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రాలు ఒకటి అమిర్ ఖాన్ నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ మరొకటి ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా. అయితే ఈ రెండు సినిమాల మధ్య ఇప్పుడు ఒక చిన్నపాటి వార్ నడుస్తుందని ఇండస్ట్రీ లో టాక్. అదే ఈ రెండు సినిమాల కోసం చేసే ఔట్ డోర్ షూటింగ్ లో వేసిన సెట్స్ గురించని సమాచారం. ఔట్ డోర్ లో జరిగే షూటింగ్ సెట్స్ కోసం ఇద్దరు సినిమాల నిర్మాతలు భారీగా ఖర్చు చేసారని చిత్ర బృందాలు వారు ఎవరికీ వారే ప్రకటించుకుంటున్నారు.
తాజాగా ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమా యూరోప్ షెడ్యూల్ లో భాగంగా వేసిన ఒక సెట్ కోసం నిర్మాత ఏకంగా రూ 80 కోట్లు ఖర్చు చేశామని చెప్పగా, ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం దుబాయ్ షెడ్యూల్ లో నిర్మించిన ప్రత్యక సెట్ కోసం సుమారు రూ 100 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించింది చిత్ర బృందం. ఇక సాహో సినిమా బడ్జెట్ కూడా 250 కోట్లు దాటనుందని టాలీవుడ్ లో టాక్. ఇక ఈ రెండు సినిమాలు నిర్మాతలకు ఎంత వరకు లాభాలు తీసుకు వస్తాయి అనేది తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.
ప్రభాస్, అమిర్ ఖాన్.. ఒకరిని మించి మరోకరు
Share.