ఆర్ ఎక్స్ 100 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇటీవల టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది RX100. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తికేయ మరియు పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ ఇవ్వడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దుమ్ములేపింది.

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.12.50 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అదిరిపోయే ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా నిర్మాతలు భారీ లాభాలు పొందారు. నిర్మాతలతో పాటు బయ్యర్లకు సైతం మంచి లాభాలు సాధించిన RX100 చిత్రానికి ఇలాంటి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఏరియాలవారీగా ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 5.30 కోట్లు
సీడెడ్ – 1.50 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.50 కోట్లు
గుంటూరు – 0.70 కోట్లు
ఈస్ట్ – 0.90 కోట్లు
వెస్ట్ – 0.70 కోట్లు
కృష్ణా – 0.70 కోట్లు
నెల్లూరు – 0.30 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 11.60 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.45 కోట్లు
ఓవర్సీస్ – 0.40 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 12.45 కోట్లు

Share.