నితిన్ తో బోల్డ్ సినిమా చేయనున్న డైరెక్టర్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నేళ్లు కష్టపడ్డాం అన్నది కాదు మొదటి సినిమాతోనే ఎంత క్రేజ్ సంపాదించాం అన్నది ఇప్పటి దర్శకుల లెక్క. తమ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఆడియెన్స్ తో శభాష్ అనిపించుకోవడంలోనే అసలు మజా ఉంటుంది. ఆ క్రమంలో ఈమధ్య వచ్చిన ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తన సత్తా ఏంటో చూపించాడు.
హీరోయిన్ లోనే విలనిజం చూపించి తెలుగు తెర మీద సరికొత్త సెన్సేషన్ గా మారాడు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన ఆరెక్స్ 100 మూవీ సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత అజయ్ కు రెండు మూడు అవకాశాలు వచ్చాయట అందులో గోపిచంద్ మూవీతో పాటుగా నితిన్ ఆఫర్ ఉందట.

ఈ ఇద్దరిలో అజయ్ భూపతి నితిన్ ను సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు రెండో సినిమా కూడా ఇదే రేంజ్ లవ్ స్టోరీగా తీస్తాడని అంటున్నారు. నితిన్ కెరియర్ లో ఎన్నడు లేని విధంగా కల్ట్ మూవీగా రాబోయే సినిమా ఉంటుందట. మరి చూస్తుంటే ఆరెక్స్ డైరక్టర్ నితిన్ ను ఏదో చేసేలానే ఉన్నాడు.

Share.