నూతన నటులు కార్తికేయ, పాయల్ రాజపుట్ జంటగా నటించిన చిత్రం ‘ ఆర్ ఎక్స్ 100 ‘ ఆర్ ఎక్స్ 100 ఈ బైక్ నేమ్ తెలియని వారు ఉండరు ముఖ్యంగా 1990 లో ఈ బండికి మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఈ బైక్ పేరునే సినిమా టైటిల్ గా పెట్టారు చిత్ర యూనిట్.
ఈ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించారు. ‘ ఆర్ ఎక్స్ 100 ‘ సినిమా టైటిల్ మరియు ట్రైలర్స్ విడుదల చేసిన సమయం నుండి టాలీవుడ్ హిట్ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ తో ఈ సినిమాని పోల్చి చూడటం మొదలయింది. అర్జున్ రెడ్డి సినిమావలె ఈ చిత్రం లో కూడా హీరో హీరోయిన్ల మధ్య ఘటైన సన్నివేశాలు ఉండటం, హీరో మాస్ మ్యానరిజంస్ యువత ని ఆకట్టుకోవడం తో ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని మరో అర్జున్ రెడ్డి అవుతుందని చెప్పటం విశేషం.
రిలీజ్ డేట్ : 12 జులై 2018
డైరెక్టర్ : అజయ్ భూపతి
మ్యూజిక్ డైరెక్టర్ : చైతన్ భరద్వాజ్
ప్రొడ్యూసర్ : అశోక్ రెడ్డి గుమ్మకొండ
హీరో: కార్తికేయ
హీరోయిన్ : పాయల్ రాజపుట్
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో శివ ( కార్తికేయ) ఒక పెద్దింటి అమ్మాయి ఇందు ( పాయల్ రాజపుట్) తో ప్రేమలో పడతాడు. హీరో శివ ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అలనాటి నటుడు రాంకీ ఈ చిత్రం లో హారో కి తండ్రి గా నటించారు. ఇక సినిమా మొదటి సన్నివేశంలోనే హీరో ఒక విలన్ ని కొట్టే సీన్ తో మొదలవుతుంది. సినిమా చిత్రీకరణ మొత్తం ఆత్రేయపురం అనే ఒక పల్లెటూరు లో చిత్రీకరించారు దర్శకుడు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళు అందరు హీరో మరియు అతని తండ్రి కి భయపడుతూ ఉంటారు.
ఇక సినిమా ఫ్లాష్ బ్యాక్ లో హీరో జెడ్ పీ టీ సి సభ్యుడు విశ్వనాధం ( రావు రమేష్) కూతురిని ప్రేమించే సన్నివేశంతో మొదలవుతుంది. సినిమా లో వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని ఘటైన సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఆధార చుంబన దృశ్యాలు యువతని ఆకర్షించవచ్చు. పాయల్ రాజపుట్ ఈ చిత్రం లో అందంగా కనిపిస్తూ బోల్డ్ గా నటించింది. సినిమా మొత్తం ఒక పల్లెటూరి వాతావరణం లో చిత్రీకరించారు ఎక్కడ బారి సెట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ వాడకపోవడం తో ఫస్ట్ హాఫ్ అంత మన మధ్య జరుగుతున్న యదార్ధ కథ అనే భావన దర్శకుడు కల్పించటంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. సినిమా ప్రీ ఇంటర్వెల్ సీన్ లో విశ్వనాధం ( హీరోయిన్ తండ్రి) కి అతని కూతురు శివ తో ప్రేమలో ఉన్న విషయం తెలుస్తుంది.
ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ప్రధాన ఆకర్షణ కాగా, సినిమా కథ లో కొత్తదనం లేకపోవటం కొంత నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి.
సినిమా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ తండ్రి తన కూతురిని ఒక యాన్ ఆర్ ఐ కి ఇచ్చి పెళ్లి చేస్తాడు, ఇది తెలుసుకున్న హీరో శివ అక్కడికి రావటంతో అతన్ని విశ్వనాధం అతని రౌడీ లతో కొట్టి పంపించేస్తాడు. అటు తర్వాత సినిమా లో హీరోయిన్ ఇందు జీవితం ఒక అనుకోని మలుపు తిరుగుతుంది. అది ఏంటని మాత్రం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు నాచురల్ గా ఉండటం తో పాటు కొంత వైలెన్స్ ఎక్కువైందని చెప్పవచ్చు.
సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే తెలుగు సినిమాల్లో హీరో కి హీరోయిన్ తండ్రి కి మధ్య జరిగే రొటీన్ యాక్షన్ సీన్స్ తో నడుస్తుంది.
హీరో కార్తికేయ, కథానాయిక పాయల్ రాజపుట్ వారి పరిధి లో చక్కగా నటించారు. హీరో తండ్రి గా రాంకీ కూడా మాస్ సీన్స్ లో జీవించారు. ఎప్పటిలాగే రావు రమేష్ కథ లో ఒదిగిపోయారు. ‘ఆర్ ఎక్స్ 100’ ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో కొద్దీ రోజుల్లో తెలుస్తుంది.
రేటింగ్: 3 / 5