అంత ఫేక్ అంటూ నాగార్జున పై ఆర్ ఎక్స్ 100 హీరో సంచలన వ్యాఖ్యలు

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరో కార్తికేయ కేవలం ఆర్ ఎక్స్ 100 అనే ఒకే ఒక్క సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఈ సినిమా వసూళ్లు కూడా ఆశించిన దాని కంటే కూడా అధికంగా రావటంతో చిత్ర నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్స్ అందరు భారీ లాభాలు వెనకేసుకున్నారు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తాజాగా ఈ యువ హీరో స్టార్ హీరో అక్కినేని నాగార్జున పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

అదేంటంటే ” వీకీపీడియా ఏమైనా తప్పు చూపిస్తుందా? ” ఎందుకంటే అది మన నాగార్జున గారి వయసు 59 సంవత్సరాలు అని చూపిస్తుంది. కానీ నాగ్ సర్ ఫిట్ నెస్ చూస్తుంటే 20 ఏళ్ళ కుర్రాళ్ళకి కూడా తన ఫిట్ నెస్ తో ఛాలెంజ్ విసరగల సత్తా ఉన్నవారిలా కనిపిస్తున్నారు ” ఎం ఉన్నాడురా బాబు ” అంటూ హీరో నాగార్జున పై ఈ యువ కథానాయకుడు ప్రశంసల జల్లు కురిపించాడు. నాగార్జున, నాని హీరోలుగా నటించిన దేవదాస్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ టాక్ తో దూసుకు పోతుంది. అందులోని నాగార్జున కనిపించిన ఒక సీన్ లోని ఫోటోనే కార్తికేయ షేర్ చేస్తూ ఈ ప్రశంసలు చేసారు.

 

Share.