రజినీకాంత్ నిర్మాతతో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ

Google+ Pinterest LinkedIn Tumblr +

`ఆర్‌.ఎక్స్.100`…… చిన్న సినిమాల్లో పెద్ద సంచ‌ల‌నం. ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన చిత్రం. తొలి చిత్రంతోనే యూత్ ఐకాన్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు హీరో కార్తికేయ‌. మూవీ ల‌వ‌ర్స్ కీ, సినీ గోయ‌ర్స్ కీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు క‌లైపులి.య‌స్‌.థాను. అభిరుచి గ‌ల, భారీ బ‌డ్జెట్‌ నిర్మాత‌గా ఆయ‌న‌ది ప్ర‌త్యేక‌మైన స్థానం. తెలుగువారికి ఎంతో ప‌రిచ‌యమున్న `కాక్క కాక్క‌`, `కంద‌సామి`, `తుపాకి`, `అరిమా నంబి`, `క‌నిద‌న్‌`, `తెరి`, `క‌బాలి`, `వేలై ఇల్లా ప‌ట్ట‌దారి2`, `స్కెచ్‌`.. ఇవ‌న్నీ ఆయ‌న నిర్మించిన చిత్రాలే. ఆర్ ఎక్స్ 100 హిట్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కార్తికేయ. 

1985 నుంచి సినిమా నిర్మాణంలో త‌న‌దైన ముద్ర వేసుకుని నిర్మాత‌గా, ప్ర‌ముఖ పంపిణీదారుడిగా త‌మిళ‌నాట కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం కార్తికేయ హీరోగా ఆయ‌న ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి క్రియేష‌న్స్ , ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి .  కార్తికేయ హీరోగా న‌టిస్తున్నారు. టి.ఎన్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు.ఆ సినిమాకు `హిప్పీ` అనే టైటిల్ ఖరారు చేసారు.

 

Share.