నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా భూమిక, జయసుధ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా వస్తోంది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేషన్స్ బ్యానర్ మీద కేఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 20 న విడుదల అయింది. అయితే తొలిరోజే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా ఆశించినంతగా రావడం లేదు. ఈ చిత్రం తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.29 కోట్ల షేర్ వసూలు చేసింది.
బాలయ్య ఇమేజ్‌తో పోలిస్తే ఇవి తక్కువ వసూళ్లే. రెండవ రోజు నుంచీ పూర్తిగా డీలా పడిపోయింది. ఆంధ్ర – తెలంగాణాలో 21.5 కోట్లకి అమ్ముడు పోయిన రూలర్ సినిమా మొదటి రోజు 4.40 కోట్ల షేర్ తో సూపర్బ్ అనిపించుకుంటే, రెండవ రోజు కేవలం కోటి రూపాయల షేర్, మూడవ రోజు కూడా కేవలం కోటి రూపాయలషేర్ మాత్రమే సాధించడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోనున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, రొటీన్ కథ కావడంతో అలు అభిమానులను.. ఇటు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా మొదటి భాగం పర్వాలేదు అనిపిస్తే రెండవ భాగం మొత్తానికే తేడే కొట్టింది. దీంతో విడుదల అయిన మొదటి రోజు నిగటివ్ టాక్ తెచ్చుకుంది. వాస్తవానికి ‘రూలర్’ లాంటి పవర్ఫుల్ టైటిల్ తో సినిమా నగానే అందరూ మంచి పవర్ ప్యాక్డ్ ఆక్షన్ ఎంటర్ టైనర్ ఆశించారు కానీ సినిమా మాత్రం అందరినీ నిరాశ పరిచిందని చెప్పాలి.
‘రూలర్’ ఫస్ట్ వీకెండ్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం- 1.32 కోట్లు
సీడెడ్- 1.59 కోట్లు
గుంటూరు- 1.49 కోట్లు
ఉత్తరాంధ్ర- 66 లక్షలు
తూర్పు గోదావరి- 41 లక్షలు
పశ్చిమ గోదావరి- 34.5 లక్షలు
కృష్ణా- 33 లక్షలు
నెల్లూరు- 31.5 లక్షలు
————————————————
ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్- 6.46కోట్లు
————————————————
కర్ణాటక + ఇండియా- 50 లక్షలు
ఓవర్సీస్- 16 లక్షలు
—————————————————-
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ షేర్- 7.12 కోట్లు
—————————————————-