నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం ‘రూలర్’. ఈ యాక్షన్ డ్రామాకు సీనియర్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ‘జైసింహా’ తరవాత కె.యస్.రవికుమార్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ‘రూలర్’పై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక, జయసుధ, ప్రకాష్ రాజ్, నాగినీడు ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సీ కళ్యాణ్ నిర్మాంచాడు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 20 న విడుదల అయింది. అయితే ఆ అంచనాలను అందుకోవటంలో బాలకృష్ణ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
తొలిరోజే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా ఆశించినంతగా రావడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించి, నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు ఘోరమైన పరాభవాన్ని చవిచూశాయి. కనీసం ఏడాది చివర్లో రూలర్ చిత్రంతోనైనా హిట్ కొడతాడేమోనని అభిమానులు కలలు కన్నారు. కానీ అది కూడా పీడకలగానే మారిపోయింది. బాలయ్య రూలర్ కలెక్షన్లు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఫస్ట్ డే కలెక్షన్లు కాస్త పర్వాలేదనిపించినా.. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది.
ఇక స్టార్ హీరో సినిమా కాబట్టి క్రిస్మస్ హాలిడే కొంత హెల్ప్ అవుతుంది అనుకున్నారు. కానీ.. క్రిస్మస్ కూడా మైనస్సే అయ్యింది. కేవలం 40 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఆంధ్ర – తెలంగాణాలో 21.5 కోట్లకి అమ్ముడు పోయిన ‘రూలర్’ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి సుమారు 13 కోట్ల భారీగా నష్టాన్ని చవి చూడనున్నారని సమాచారం. దీంతో బయర్లు అయోమయంలో పడ్డారు.
‘రూలర్’ 6 డేస్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం- 1.66 కోట్లు
సీడెడ్- 1.95 కోట్లు
గుంటూరు- 1.55 కోట్లు
ఉత్తరాంధ్ర- 72 లక్షలు
తూర్పు గోదావరి- 48.5 లక్షలు
పశ్చిమ గోదావరి- 40.5 లక్షలు
కృష్ణా- 40 లక్షలు
నెల్లూరు- 35 లక్షలు
———————————————-
6 డేస్ మొత్తం షేర్- 7.52 కోట్లు
———————————————–
కర్ణాటక + ఇండియా- 1.10 కోట్లు
ఓవర్సీస్- 0.54 కోట్లు
————————————————
వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్- 9.16 కోట్లు
————————————————-