Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ గురించి.. ఆయన స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈయన అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడమే కాకుండా అంతకుమించి అభిమానులను పొందారు.. ఇప్పటి వరకు నార్త్ లో ఈయన సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. కానీ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారనటంలో సందేహం లేదు.. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలు అంటూ దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు రాజకీయాలలో ప్రజల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన సినిమాలు చేస్తూనే ఆ సినిమాలకు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పుడు ఇన్ని సినిమాలు లైన్ లో ఉండగానే పవన్ కళ్యాణ్ మరో మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళంలో సముద్రఖని నటించిన వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం రాబోతోంది.
ఈ సినిమాలో కేతిక శర్మ, సాయిధరమ్ తేజ్ , ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ తన డేట్స్ లో 20 రోజులు కేటాయిస్తున్నారని సమాచారం. అయితే ఆ 20 రోజులకే పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.80 కోట్లు డిమాండ్ చేశారు అని తెలుస్తోంది. అటు చిత్ర బృందం కూడా పవన్ కళ్యాణ్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని పారితోషకం ఇవ్వడానికి ఓకే చెప్పిందట.
ఆ లెక్కన చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కరోజు పారితోషకం రూ.4 కోట్లు అని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో భారీ పారిపోషకం అందుకుంటున్న వారిలో ముందుగా ప్రభాస్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా ఉన్నారని సమాచారం.