RRR: మూవీ నుంచి రామ్ చరణ్ ట్రైలర్ విడుదల..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీగా నటిస్తున్న చిత్రం RRR ఈ సినిమా కు సంబంధించి మరొక రెండు రోజుల్లో ట్రైలర్ విడుదల కానుంది. దర్శక ధీరుడు రాజమౌళి.. విజువల్ ట్రీట్ ఎలా ఉంటుందో, ఎన్టీఆర్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో అని ఆత్రుతగా ఉంటున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, పాటల తో అంచనాలను భారీగా పెంచేశాయి.వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. రామ్ చరణ్ కు సంబంధించి.. తాజాగా ఒక టీజర్ ను విడుదల చేయడం జరిగింది. రికార్డ్ టీజర్ విషయానికి వస్తే..రామ్ పాత్రధారి రామ్ చరణ్ కు రాబోయే ట్రైలర్ నుంచి ఆయన నటించిన ఒక సన్నివేశాన్ని కట్ చేసి పంపించారు. ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్’.. అంటూ .. తారక్ తన ట్విట్టర్ ద్వారా చెర్రీకి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. మంటల్లోంచి చెర్రీ నడుచుకొని వస్తున్న ఈ క్లిప్ సినిమాలో గూస్ బంప్స్ తెప్పిస్తుందని అర్ధమవుతోంది. పోలీస్ గెటప్ లో చాలా ఫెరోషియస్ గా కనిపిస్తున్న రామ్ చరణ్ నటించిన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share.