RRR గ్లింప్స్ పై అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్ ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అభిమానులు అందరు ఎంతగానో ఎదురుచూసే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంకు సంబందించిన తాజా అప్ డేట్ వచ్చేసింది.అటు ఎన్టీఆర్ అభిమానులను ఇటు మెగా అభిమానులను ఉర్రూతలూగించేలా చేసే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబందించిన గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసారు. ఈ వీడియో చూస్తే రోమాలు నిక్కపొడుచుకోవడం గ్యారంటీ అనే చెప్పాలి. ఈ వీడియోపై అల్లు అర్జున్ స్పందించారు.

‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ చూస్తే ఎవరికయినా మతిపోతోందని, దర్శక దిగ్గజం రాజమౌళి గారు మన భారతీయ చిత్రపరిశ్రమకు గర్వకారణం” అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. మైండ్ బ్లోయింగ్ వీడియో అని, నా బ్రదర్ రామ్ చరణ్, నా బావ తారక్ ఇద్దరూ కలిసి పవర్ ప్యాక్ షో ను మన ముందుకు తీసుకుని వచ్చారు.అలాగే ఈ చిత్రంలో నటించిన అజయ్ దేవగణ్ కు, అలియా భట్, సాంకేతిక నిపుణులు అందరికి శుభాకాంక్షలు” అంటూ అల్లు అర్జున్సోషల్ మీడియా వేదిక ద్వారా ట్వీట్ చేశారు.

Share.