ప్రస్తుతం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో RRR మూవీ కూడా ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని గంటల క్రితం విడుదలై మంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే మరికొంతమంది మాత్రం అంత లేదు అని తెలియజేస్తున్నారు. ఇక ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను భారీ పిరియాడిక్ డ్రామా గా తెరకెక్కించడం జరిగింది.
అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు ఈ చిత్రం నుంచి మోస్ట్ అప్డేట్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. అందుచేతనే ఈ రోజా ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖులు ట్రైలర్ చూశాక తమ సాలిడ్ రియాక్షన్ని తెలియజేశారు. ప్రస్తుతం హీరో మెగాస్టార్ చిరంజీవి తన పవర్ ఫుల్ రియాక్షన్ ని ఎంతో ఎగ్జైటింగ్ గా తెలియజేశారు.RRR ట్రైలర్ బీభత్సం.. ఇక ప్రభంజనం కోసం వచ్చే జనవరి 7 వరకు ఎదురు చూస్తూ ఉంటానని తనదైన శైలిలో రియాక్షన్ తెలియజేశారు. దీంతో ఈ రిప్లై ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
RRR Trailer బీభత్సం …ఇక ప్రభంజనం కోసం జనవరి 7 వరకు ఎదురుచూస్తుంటాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 9, 2021