RRR మూవీ నుంచి బిగ్ అప్డేట్..పుష్ప కి పోటీ గా ట్రైలర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

 డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇక ఇందులో కథానాయకి లుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ శ్రియ, అజయ్ దేవగన్ నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర బృందం నుండి ఒక వార్త వినిపిస్తోంది.

అదేమిటంటే డిసెంబర్ 3వ తేదీన ఈ సినిమాకు సంబంధించి అతి పెద్ద ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టు గా రాజమౌళి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాట అయిన, వీడియో లైన ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. అయితే తాజాగా ట్రైలర్ డేట్ న సిక్స్ చేయడంవల్ల, ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం ఎంతో సంబరపడిపోతున్నారు. ఈ సినిమాకు దాదాపుగా 350 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు.

Share.