RRR మూవీ నుంచి కొమరం భీమ్ తో శ్రేయ ఎమోషనల్ పోస్టర్ వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇకపోతే ఈ సినిమాలో ఒలీవియా, ఆలియాభట్, శ్రేయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు వీడియో సాంగ్ లు, టీజర్లు, ట్రైలర్లు వచ్చి ప్రేక్షకులలో మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.

ఇకపోతే తాజాగా మరొక పోస్టర్ విడుదలవ్వగా అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో మనం చూసినట్లయితే చిన్న వయసులో ఉన్న కొమరంభీమ్ , అలాగే చిన్న వయసులో వున్న అలియా భట్ తో వీరి తల్లి శ్రేయ బ్రిటిష్ దుర్మార్గుల నుంచి వారి పిల్లలను కాపాడడం కోసం ఆమె.. వారిద్దరి చేతులను తన రెండు చేతులతో పట్టుకొని ఎక్కడికో భయంగా పారి పోతున్నట్లు మనం చూడవచ్చు. ఇక ఈ పోస్టర్ చూసే కొద్దీ సినిమా ఎలా ఉంటుందో అనే ఆలోచన మరింత ఎక్కువ అవుతోంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండటం విశేషం.

Share.