డైరెక్టర్ రాజమౌళి బాహుబలి-2 తరువాత తెరకెక్కుతున్న భారీ చిత్రం RRR ఈ సినిమా కోసం దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకి కథ అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ రాజమౌళి సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను తెలియ జేశారు.
తన సక్సెస్ సీక్రెట్ గురించి జక్కన్న మాట్లాడుతూ.. కానీ ఇప్పుడు సక్సెస్ ను సొంతం చేసుకున్నానని భావించనని ప్రతి సినిమాని మొదటి సినిమాలా భావిస్తాను అని తెలియజేశారు. తాము ఎంపిక చేసుకున్న కథకు సరైన నటీనటులను ఎంచుకోవడమే బలమని భావిస్తానని తెలియజేశారు. ఆర్ ఆర్ సినిమా డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అని రాజమౌళి తెలియజేశారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన కదా వెన్నుముక అని నేను ఏ విధంగా టార్చర్ చేశాను మా నాన్న అడగాలని రాజమౌళి తెలియజేశారు.
సినిమా అజయ్ దేవగన్ నుంచి ప్రారంభమవుతుందని తెలియజేస్తూ.. ప్రతి ఒక్కరిలోనూ మంచి స్ఫూర్తి నింపే విధంగా అజయ్దేవగన్ పాత్ర ఉంటుందని రాజమౌళి తెలియజేశారు.