రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం..RRR ఇందులో కథానాయకులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్నరు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ వేడుకలు కూడా ముంబైలో జరగడం విశేషం. ఈ వేడుకకి చీఫ్ గెస్ట్ గా సల్మాన్ ఖాన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలకమైన వార్తలు చేయడం జరిగింది.
RRR మూవీ విడుదలైన నాలుగు నెలల వరకు ఏ ఇండియా ఫిలిం రిలీజ్ చేయడానికి సాహసించకండి అని వ్యాఖ్యానించారు.కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ గా మారుతున్నాయి. కరణ్ జోహార్ ఈవెంట్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు ఆలియా భట్, శ్రీయ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అల్లూరి సీతా రామ రాజు పాత్రలో రామ్ చరణ్, కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ నటించారు.ఆలియా భట్, ఒలీవియా మోరిస్.. హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇందులో అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం కీరవాణి అందించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉన్నది