RRR లో ఎన్టీఆర్ వాడిన బైక్ కు ఎంత ఖర్చు చేశారంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా దేశ వ్యాప్తంగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ గురించి చాలా రీసెర్చ్ జరుగుతోంది.. ఈ బైక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆ బైక్ పేరు వెలోసెట్ రెట్రో బైక్. ఇక ఈ బైకు 1934 కు చెందిన సీరీస్ బైక్ లా కనిపిస్తోంది. ఇక ఈ బైక్ బ్రిటన్ కు చెందినది. ఈ వెలోసెట్ ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందినది.ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ బర్మింగ్‌హామ్‌లో ఉంది.

Chittoor District NTRFans on Twitter: "#Jennifer #KomaramBheemNTR @tarak9999 @OliviaMorris891 Bheem bike lo 💞 Jennifer Car lo https://t.co/yo3sboRbC6" / Twitter
1920 నుంచి 1950 వరకు.. వెలోసెట్‌ అంతర్జాతీయ మోటార్ రేసింగ్‌ విభాగంలో ప్రధాన పోటీదారుగా నిలిచింది. శక్తివంతమైన 350 సిసి, 500 సిసి బైక్‌లను తయారు చేసింది ఈ వెలోసెట్ . 1971వ సంవత్సరం లో పిభ్రవరి తర్వాత అధికారికంగా బైక్‌ల ఉత్పత్తిని వెలోసెట్‌ నిలిపివేసింది. అయితే RRR సినిమా కోసం ఈ బైక్లో కొన్ని మార్పులు చేశారు. దాదాపుగా దీని కాస్ట్ తొమ్మిది లక్షలు ఉంటుందట.. ఇలాంటి రెట్రో బైక్స్‌ ఎక్కువగా అక‌్షన్‌ వెబ్‌సైట్‌లోనే కనిపిస్తాయి.ఇక ఈ సినిమాలో ఆ బైక్ కోసం రాజమౌళి ఏకంగా రూ. లక్షలు ఖర్చు పెట్టాడని సమాచారం.

Share.