దర్శక ధీర రాజమౌళి సినిమా అంటేనే …. సినిమా షూటింగ్ నుంచి అది ముగిసేవరకు ఎప్పుడూ… ఏదో ఒక ట్విస్ట్ లు అప్డేట్ గా వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్‌లతో భారీ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి హీరోలు మినహా మిగతా కీలక నటుల గురించి పెద్దగా విషయాలు ఏవీ బయటకు రాలేదు. ఆ వివరాలకోసం ఆయా హీరోల అభిమానుల కూడా ఆసక్తిగా ఎదురుచూపులు చూస్తున్నారు. కానీ ఆ విషయాలు ఏవీ బయటకి పొక్కకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతోంది.
కానీ రాజమౌళి మాత్రం ‘RRR’కు కూడా హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారట. అందుకే ఓ భారీ ప్లాన్ కూడా వేశారు. అదేంటి అంటే…? సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను కూడా భాగం చేయనున్నారనే రూమర్ బాగా వినిపిస్తోంది. ప్రభాస్ కోసం ఓ అతిధి పాత్ర సృష్టించి …. దాంట్లో ప్రభాస్ తో నటింపచేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. దీనికి ప్రభాస్ కూడా పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కబోతున్న ఈ సినిమా కు బాహుబలి కూడా తోడయితే ఇంకా ఈ సినిమా అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.