ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ పొందే అర్హత లేదు..తమ్మారెడ్డి భరద్వాజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ సినిమా రికార్డు స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కాగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు బాగా మారుమ్రోగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డుల మీద అవార్డులు అందుకుంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ కి కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి అలాగే హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లపై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లు. ఇకపోతే ప్రస్తుతం చిత్ర బృందం కూడా అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆస్కార్ కి నామినేట్ అయింది అన్న సంతోషంలో అభిమానులు ఎంజాయ్ చేస్తుండగా.. తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం ఈ సినిమాకు ఆస్కార్ తీసుకొని అర్హత లేదు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.

భరద్వాజ తమ్మారెడ్డి మాట్లాడుతూ..” ఇప్పటికే నేను ఇద్దరు ముగ్గురికి చెప్పాను.. ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్లదు అని .. ఆస్కార్ ఎక్కువగా అక్కడ లోకల్ వాళ్లకి, ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఎక్కువగా ఇస్తారు. మన దేశం నుంచి వెళ్లే సినిమాలకు ఇండిపెండెంట్గా చాలా కండిషన్స్ ఉంటాయి. అవి చెక్ చేసిన తర్వాత ఆస్కార్ కు పంపిస్తారు . ఆస్కార్ కి కానీ నేషనల్ అవార్డుకు కానీ వెళ్ళడానికి కొన్ని పద్ధతులు, గైడ్లైన్స్ ఉంటాయి. సమాజానికి పనికొచ్చే సినిమాలో లేక టెక్నికల్గా అద్భుతంగా ఉన్న సినిమాలు మాత్రమే ఆస్కార్ కి వెళ్తాయి . కానీ డబ్బులు ఎక్కువగా వచ్చాయి కాబట్టి ఎవరో నలుగురు ఈ సినిమా ఆస్కార్ కి వెళ్తుంది అనగానే ఈ సినిమా ఆస్కార్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా కేవలం కమర్షియల్ మూవీ మాత్రమే ఇలాంటి సినిమాకు ఆస్కార్ కి వెళ్లే అర్హత ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి అంటూ తెలిపారు.

Share.