బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేసే క్రేజీగా ఉంటుందో అని ఆలోచించిన రాజమౌళి. మెగా నందమూరి కాంబినేషన్ లో సినిమా షురూ చేశాడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎప్పుడు లేనిది రాజమౌళి తన సినిమా రిలీజ్ డేట్ కూడా ముందే ఎనౌన్స్ చేశాడు. 2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ అంటూ ప్రెస్ మీట్ లో చెప్పాడు.
అయితే అనుకున్న డేట్ కు ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కష్టమని అంటున్నారు. సినిమా మొదలు పెట్టిన కొద్దిరోజులకే ఎన్.టి.ఆర్ కు, రాం చరణ్ కు గాయాలవడం వల్ల షూటింగ్ కొద్దిరోజులు వాయిదా పడ్డది. ఇక హీరోయిన్స్ కోసం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అలియా భట్ కూడా తన డేట్స్ అడ్జెస్ట్ చేయడంలో కాస్త లేట్ చేసిందట. అసలైతే 2020 జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేసి ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్, వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కోసం అనుకున్నారు.
కాని ఇప్పుడు షూటింగే ఏప్రిల్, మే నెల వరకు పూర్తయ్యేలా ఉందట. అందుకే అనుకున్నట్టుగా జూలై 30న ఆర్.ఆర్.ఆర్ రావడం కష్టమని తెలుస్తుంది. మరి జూలై కాకుంటే ఆర్.ఆర్.ఆర్ మళ్లీ ఎప్పుడు వస్తుంది అంటే తెలుస్తున్న సమాచారం ప్రకారం 2020 దసరాకి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఉండొచ్చని టాక్. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చిత్రయూనిట్ వెళ్లడించాల్సి ఉంది.