రౌడీ బాయ్స్ మోషన్ పోస్టర్ రిలీజ్..రెస్పాన్స్ అదుర్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలను నిర్మాత దిల్ రాజు పరిచయం చేశారు. తాజాగా ఆయన మరో యంగ్ హీరో శిరీష్ ను పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాకు రౌడీ బాయ్స్ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు హర్ష కొనుగంటి డైరెక్షన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అనేది విడుదల అయ్యింది. చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి భారీ అంచనాలతో ఉన్నారు.

ప్రస్తుతం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ఈపాటికే ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో హీరో ఆశిష్ కు జోడిగా కుర్రకారు మనసులను దోచిన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. సినిమాటోగ్రఫీని మాధి అందిస్తున్నాడు. ఈ సినిమాకు యంగ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కూర్చనున్నాడు. నిర్మాత దిల్ రాజు అక్టోబర్ లో ఈ సినిమా విడుదల చేయనున్నారు.

Share.