బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పటికీ జబర్దస్త్ కార్యక్రమానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతోమంది ఇందులో నుంచి కమెడియన్లగా, హీరోలుగా, హీరోయిన్లుగా వెండితెర పైన ఒక వెలుగు వెలుగుతున్నారు. దాదాపుగా ఈ కామెడీ షో వచ్చి ఇప్పటికీ 10 సంవత్సరాలు పైనే అవుతోంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు టిఆర్పి రేటింగ్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ కార్యక్రమం నుంచి జడ్జిగా మొదట నాగబాబు, రోజా వ్యవహరిస్తూ ఉండేవారు. అయితే కొన్ని కారణాల చేత నాగబాబు ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.
ఇక ఆ తర్వాత రోజా కూడా 9 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమానికి జడ్జిగా ఉండేది. గడిచిన కొన్ని నెలల క్రితం ఈమెకు మంత్రి పదవి రావడంతో తనపై మరికొన్ని బాధ్యతలు పెరిగాయని అందుచేతనే తాను ఇష్టం లేకపోయినా సరే జబర్దస్త్ కార్యక్రమాలకు దూరం కావాలని తెలియజేసింది. దీంతో తాజాగా మరొకసారి రోజా జబర్దస్త్ కార్యక్రమం లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది. ఇంద్రజ ,కృష్ణ భగవానులతో పాటు రోజా కూడా జడ్జిగా వ్యవహరించింది.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది. అయితే జబర్దస్త్ కార్యక్రమం 500 ఎపిసోడ్లు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో రోజా ఈ వేదికపై సందడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రోజా ఎప్పటిలాగానే కమెడియన్స్ పైన పంచు డైలాగులు వేస్తూ అందరిని నవ్వించింది. ఇక రోజా గారికి సన్మానం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రోజా మాట్లాడుతూ.. తనతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ అందరూ కనుమరుగయ్యారు.. కానీ ఇప్పటికి నేను ఇలా గుర్తున్నాను అంటే దానికి కారణం జబర్దస్త్ అంటూ తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.