2.ఓ 5 రోజుల కలక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కు ఎంత రాబట్టాలి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

శంకర్, రజిని కలిసి చేసిన ప్రతిష్టాత్మక సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వచ్చిన ఈ మూవీ తెలుగు రెండు రాష్ట్రాల్లో 72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొదటిరోజు టాక్ బాగున్నా సినిమా కలక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. గురువారం రిలీజైన 2.ఓ 5 రోజుల్లో 36. 35 కోట్ల షేర్ రాబట్టింది. ఎన్వీ ప్రసాద్, దిల్ రాజులు కలిసి 2.ఓ తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేశారు. ఇక ఓవరాల్ గా 2.ఓ అన్ని భాషల్లో కలిపి 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని లైకా ప్రొడక్షన్స్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు.

తెలుగు రెండు రాష్ట్రాల్లో 2.ఓ 5 రోజుల్లో 36.35 కోట్లు రాబట్టింది. అయితే డిసెంబర్ 7 వరకు సినిమాలు లేవు కాబట్టి మరో నాలుగురు రోజులు ఈ కలక్షన్స్ వస్తే సేఫ్ ప్రాజెక్ట్ అయినట్టే లెక్క. అయితే డిసెంబర్ 7న చిన్న సినిమాలు వస్తున్నాయి కాబట్టి 2.ఓకు పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు.

ఏరియాల వారిగా 2.ఓ తెలుగు రెండు రాష్ట్రాల కలక్షన్స్..

నైజాం : 15.08 కోట్లు

సీడెడ్ : 5.68 కోట్లు

ఉత్తరాంధ్ర : 4.67 కోట్లు

ఈస్ట్ : 2.69 కోట్లు

వెస్ట్ : 1.85 కోట్లు

కృష్ణా : 2.17 కోట్లు

గుంటూరు : 2.76 కోట్లు

నెల్లూరు : 1.45 కోట్లు

ఏపి/తెలంగాణ : 36.35 కోట్లు

Share.