సూపర్ స్టార్ రజినీకాంత్, అమీ జాక్సన్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రోబో 2 . 0 ట్రైలర్ ఈ రోజు అధికారికంగా విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటించటం విశేషం. అమీ జాక్సన్ తొలి సారి రజినీకాంత్ సరసన హీరోయిన్ గా నటించారు. శంకర్ ఈ సినిమాలో విజువల్ అఫక్ట్స్ పై ప్రత్యక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా పై తమిళ ప్రేక్షకులే కాకుండా ఎవత్ సౌత్ ఇండియా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చుస్తునారు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ట్రైలర్ చూస్తుంటే చిత్రంలోని గ్రాఫిక్స్ పై శంకర్ కనబరిచిన శ్రద్ధ సినిమాలో ప్రత్యక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తుంది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 29 న విడుదల కానుంది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా తన నటనతో ఆకట్టుకోనున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది.