రజినికాంత్ ‘2.ఓ’ రివ్యూ & రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

శంకర్, రజినికాంత్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా భారీ అంచనాలతో వచ్చిన సినిమా 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ ఈ సినిమా నిర్మించారు. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో విలన్ గా అక్షయ్ కుమార్ నటించడం జరిగింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

హఠాత్తుగా సెల్ ఫోన్స్ అన్ని మాయమవుతూ ఉంటాయి. పోలీసులు, ప్రభుత్వం హైయ్యర్ అఫిషియల్స్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అందులో వసీకర్ (రజినికాంత్) మరోసారి చిట్టిని పిలిపించాల్సిన అవసరం వచ్చిందని అంటాడు. దానికి ఒప్పుకున్న ప్రభుత్వం చిట్టి రోబోని ప్రయోగిస్తుంది. సెల్ ఫోన్స్ మాయమవడానికి కారణం పక్షి రాజా (అక్షయ్ కుమార్) అని తెలుస్కుంటాడు. చిట్టి పక్షి రాజాపై ఎలా యుద్ధం చేశాడు. అసలు పక్షి రాజు ఎందుకు మనుషుల మీద పగబట్టాడు. చివరకు చిట్టి పక్షి రాజుకి ఎలా నాశనం చేశాడు అన్నది సినిమా కథ.
విశ్లేషణ:
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో వాటిని అందుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. పూర్తి టెక్నికల్ వండర్గా తెరకెక్కిన ఈ మూవీను శంకర్ సైంటిఫిక్ ఎంటర్టైన్మెంట్గా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఇక సినిమా విషయానికి వస్తే.. సినిమా టైటిల్ కార్డు పడటంతోనే సినిమా కాన్సెప్ట్ ఏమిటో మనకు అర్ధమవుతుంది. ఇక పక్షి ప్రేమికుడిగా అక్షయ్ కుమార్ ముసలివాడిగా మనకు కనిపిస్తాడు. అయితే చిత్రం స్టార్టింగ్లోనే అతడు మరణించడం.. ఆపై అతడు ఏం చేశాడన్నది సినిమా చూస్తేనే మనకు స్పష్టంగా అర్ధమవుతుంది.

అటు వసీగా మరియు చిట్టిగా రజినీకాంత్ యాక్టింగ్తో మనల్ని మరోసారి మైమరపించాడు. కాగా ఈసారి మరింత ఎనర్జిటిక్గా కనిపించాడు. ఫస్ట్హాఫ్ మొత్తం సెల్ఫోన్లు మాయమవ్వడం.. వాటి వెనుక ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికే చిట్టీని మళ్లీ తీసుకొస్తాడు వసీ. కట్ చేస్తే.. రాక్షసపక్షిగా మారిన పక్షిరాజు మనుష్యులను చంపాలని కంకణం కట్టుకుంటాడు. దీంతో అతడిని ఆపేందుకు చిట్టీని తీసుకువస్తాడు వసీ. అయితే అతడి ముందు చిట్టి నిలవలేకపోతాడు.

ఇక సెకండాఫ్లో చిట్టీ 2.0గా రీలోడ్ అయ్యి పక్షిరాజును ఎదుర్కొనే విధానం అద్భుతంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య జరిగే VFX ఫైట్స్ ఇండియన్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్తాయి. వీరిద్దరి మధ్య యుద్ధంలో చిట్టీ 2.0 కూడా వెనుకబబటంతో ఎవ్వరూ ఊహించని విధంగా చిట్టీ 3.0 అప్డేటెడ్ సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడే ఆడియెన్స్ మొత్తం సినిమాను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఇక పక్షిరాజు ఎలా అంతమయ్యాడు అనే అంశంతో క్లైమాక్స్ ముగిసి శుభం కార్డు పడుతుంది. ఓవరాల్గా ఇదొక విజువల్ వండర్ అని మొదట్నుండీ చెబుతున్న చిత్ర యూనిట్ దాన్ని పూర్తి స్థాయిలో నిజం చేస్తూ మనముందు నిలబెట్టారు. ఇది ఇండియన్ సినిమాను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సంకోచం లేదు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఈ చిత్రానికి వన్ అండ్ ఓన్లీ మేజర్ హీరో అయిన రజినీకాంత్ సినిమా మొత్తాన్ని లాక్కొచ్చాడు. అటు వసీగా, చిట్టీగా, చిట్టీ 2.0గా కూడా రజినీ యాక్టింగ్కు ఫిదా అవ్వాల్సిందే. పక్షిరాజుగా అక్షయ్ కుమార్ కూడా సూపర్ అనిపించాడు. అటు వెన్నెలగా రోబోట్ పాత్రలో అమీ కూడా ఈసారి ఆకట్టుకుంది. మిగతావారు పెద్దగా మనకు కనిపించరు.

టెక్నికల్ డిపార్ట్మెంట్:
ఈ సినిమాకు వెన్నుముక్క ఏమిటంటే అది ఖచ్చితంగా టెక్నికల్ డిపార్ట్మెంట్ అని చెప్పాలి. తారాస్థాయిలో ఉండే VFX విలువలను సినిమాటోగ్రఫర్ నీరవ్ షా అద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్క సీన్ మనల్ని కట్టిపడేస్తుంది. ఇక మ్యూజిక్ పరంగా ఏఆర్ రెహమాన్ బీజీఎంతో దుమ్ములేపాడు. పాటలు పెద్దగా ఆస్కారం లేదుగాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మరోసారి తన పనితనం చూపించాడు. లైకా ప్రొడక్షన్స్ విలువలు సూపర్బ్. అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కడంతో ఇది హాలీవుడ్ స్థాయిలో మనకు కనిపిస్తుంది.

చివరగా: 2.0 ఒక విజువల్ వండర్ కాదు.. అంతకు మించి!

రేటింగ్: 3.5/5

Share.