సూపర్‌స్టార్ రజనికాంత్ నటించి, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రోబో సీక్వెల్ 2.0. ఈ సినిమా ఇప్పుడు చైనాలో విడుదలకు సిద్దమై రికార్డు దిశగా దూసుకుపోతుంది. ఇండియన్ బిగ్ మూవీగా తెరకెక్కిన 2.0 చిత్రంను దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఈ సినిమా ఓసందేశాత్మక చిత్రంగా ప్రజల మన్ననలు పొందింది. అయితే అనుకున్నమేరకు చిత్రం మాత్రం ఆడలేదు.
వాస్తవానికి రజనికాంత్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా గత ఏడాది నవంబర్లోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండే. కానీ చైనాలో మాత్రం విడుదల కాలేదు. చైనా, భారత్ దేశాల నడుమ నెలకొన్న కొన్ని అనివార్య కారణాలతో సినిమా విడుదల కాలేదు. అయితే చైనాలో సినిమాను విడుదల చేయాలని నిర్మాత, బయ్యర్లు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే బయ్యర్లు, నిర్మాత కోరిక ఇన్ని రోజులకు తీరనున్నది. సెప్టెంబర్ 6న ఈ సినిమా చైనాలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్దమైంది.
గత నెలలోనే విడుదల చేద్దామనుకుంటే ద లయన్ కింగ్ సినిమా రావడంతో ఈ చిత్రానికి పెద్ద దెబ్బగా మారుతుందని బయ్యర్లు బయపడ్డారు. అందుకే రెండు నెలలు ఆగిన తరువాత సెప్టెంబర్ 6న విడుదలకు ఓకే చేశారు. అయితే ఓ విదేశి చిత్రం చైనాలో 47వేల థియోటర్లలో విడుదల చేయడం అనేది చైనా చరిత్రలోనే రికార్డు అట. అంటే 2.0 చిత్రం చైనాలో 47వేలకు పైగా థియోటర్లలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారట. మరి ఈ చిత్రం చైనాలో ఇంకా ఏ రికార్డు సాధిస్తుందో వేచి చూడాలి మరి.