అమ‌లాపాల్ న‌గ్న‌త్యంపై వ‌ర్మ ట్వీట్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆమే టీజ‌ర్‌లో అమ‌లాపాల్ న‌గ్న‌త్యంపై భారీ స్థాయిలో వ్యూస్ వ‌స్తున్నాయి. ఆమే టీజ‌ర్‌కు విశేష స్పంద‌న వ‌స్తుండ‌టంతో చిత్ర‌యూనిట్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. అయితే ఈ టీజ‌ర్‌పైన, అమ‌లాపాల్ న‌గ్న‌త్వంపై ప్ర‌ముఖ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌లో అమ‌లాపాల్‌పై ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురిపించాడు.

అమ‌లాపాల్ న‌టించిన ఆమే చిత్రంపై రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్ ఇదే. ఆమే… ఆద్భుత‌మైన టీజ‌ర్‌. త‌ప్ప‌క చూడండి.. ఇందులో అమ‌లాపాల్ నిజాయితీతో కూడిన న‌గ్న‌త్వం నా గుండెల‌ను తాకింది.. అలాగే ద‌ర్శ‌కుడు ఎమ్మార్ రత్న ప్ర‌తిభ అమోఘం అంటూ రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ చేశారు. త‌న స్పంద‌న‌తో పాటుగా ఆమే టీజ‌ర్‌ను షేర్ చేశాడు.

అమ‌లాపాల్ గ‌తంలో బెజ‌వాడ‌, నాయ‌క్‌, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, జెండాపై క‌పిరాజు తో పాటు ప‌లు సినిమాల‌ల్లో న‌టించింది. తెలుగులో ఆమేగా, త‌మిళంలో ఆడై పేరుతో చిత్రం తెర‌కెక్కుతుంది. అమ‌లాపాల్ న‌గ్న‌త్వం ఉన్న టీజ‌ర్‌కు విశేష స్పంద‌న వ‌స్తుండ‌టంతో చిత్ర‌యూనిట్ ఉత్సాహం రెట్టింపు అయింది. అదే విధంగా అక్కినేని స‌మంత కూడా అమ‌లాపాల్ సాహాసంకు మ‌ద్ద‌తుగా సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా, ఆమే దైర్యాన్ని కొనియాడింది. త‌న సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించ‌డంతో అమ‌లాపాల్ స‌మంత‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ రీట్వీట్ చేశారు.

Share.